మహేష్ సినిమాలో సిస్టర్ సెంటిమెంటే హైలైట్ ?

Published on Mar 7, 2023 2:15 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా గురించి ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో క్రేజీ రోల్ ఉంది. ఇది ఒక సిస్టర్ క్యారెక్టర్ అని, ఈ సినిమా కథ మొత్తం ఓ సిస్టర్ క్యారెక్టర్ చుట్టూ సాగుతుందని.. పైగా సినిమాలోనే ఈ సిస్టర్ పాత్ర చాలా కీలకమైనది అని తెలుస్తోంది. అందుకే, ఈ పాత్ర కోసం ఓ స్టార్ నటిని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఐతే, ఇలాంటి పాత్రలో సాయి పల్లవి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే, ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక అప్ డేట్ రాలేదు.

మొత్తానికి త్రివిక్రమ్ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :