
సౌత్ ఇండియన్ మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్ రెండు సంవత్సరాలపైనే కష్టపడి చేసిన సినిమా ‘ఐ’ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తన తదుపరి సినిమా ఎవరితో అన్నది శంకర్ ఇంకా ఖరారు చేయలేదు. కానీ చాలా రోజులుగా శంకర్ సూపర్ హిట్ మూవీ ‘రోబో’కి సీక్వెల్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడని మాత్రం తెలుస్తోంది. ఇప్పటికే రజినీకాంత్ ని కలిసి కథా పరంచ్గా చర్చలు జరుపుతున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా కోసం ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసే పనిలో శంకర్ ఉన్నాడు.
ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రోబో సీక్వెల్ లో విక్రమ్ కూడా ఉంటాడని అంటున్నారు. ముందుగా రోబోలో విలన్ గా షారుఖ్ ఖాన్ లేదా అమీర్ ఖాన్ లను అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి రజినీకాంత్ – విక్రమ్ కాంబినేషన్ ని సెట్ చెయ్యాలనే ఉద్దేశంలో శంకర్ ఉన్నట్టు సమాచారం. ఒకవేళ రోబో సీక్వెల్ కోసం ఈ కాంబినేషన్ సెట్ అయితే థియేటర్ లో ఆడియన్స్ కి పండగే అని చెప్పాలి. ప్రస్తుతానికి ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ శంకర్ తో రోబో సీక్వెల్ చేయడానికి తమిళంలో కత్తి సినిమాని నిర్మించిన లైకా ప్రొడక్షన్ హౌస్ వారు సిద్దంగా ఉన్నారు.