హీరో శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ అప్ డేట్ తెలిసింది. ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ షెడ్యూల్ లో శర్వానంద్ పై ఇంట్రో సీన్స్ ను తీస్తారట. ఈ సినిమాలో ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ సీక్వెన్స్ కి సంబంధించిన ఓ సెట్ ను కూడా వేయబోతున్నట్లు తెలుస్తోంది.
అన్నట్టు శర్వానంద్ ఈ సినిమా కోసం తన లుక్ ను మళ్లీ కొత్తగా ట్రై చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడు. కాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.
