తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఏపీలో ఓ పార్టీ తరపున పోటీ చేస్తున్న తన స్నేహితుని కోసం నంద్యాల ప్రాంతానికి వెళ్లడం ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అక్కడకికి వచ్చిన భారీ జన సందోహం చూసి చాలా మంది మతి కూడా చలించింది. అయితే అల్లు అర్జున్ (Allu Arjun in Nandyal) తన స్నేహితుని కోసం వెళితే ఇది కాస్త సోషల్ మీడియాలో పలు రకాలుగా ప్రచారం జరిగింది.
అల్లు అర్జున్ ఫలానా పార్టీకి మద్దతుగా వెళ్లాడని కొందరు అనుకుంటే మరికొందరు ఇదే అంశాన్ని తమ పార్టీకే మద్దతుగా అల్లు అర్జున్ వచ్చాడని ప్రచారం చేసుకున్నారు. దీనితో ఈ అంశం ఒకింత కాంట్రవర్సీకే నెటిజన్స్, సినీ రాజకీయ వర్గాల్లో కూడా దారి తీసింది. అయితే అల్లు అర్జున్ ని తప్పుగా అనుకున్న వారు, అలా అనుకునేలా చేసిన వారికి కూడా అల్లు అర్జున్ నుంచి ఒక క్లియర్ స్టేట్మెంట్ వచ్చేసింది.
తాను ఏ పార్టీకి కూడా మద్దతుగా రాలేదు అని కేవలం తన స్నేహితుడికి తన సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే వచ్చాను అని గతంలో ట్వీట్ పెట్టాను, అది నా మనసుకి సరిపోదు అనిపించింది అందుకే ఈసారి వచ్చాను అని నా మనసుకి నచ్చితే చేస్తా, నా మనసుకి నచ్చినవాళ్లు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తాను అని మీడియాతో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ అంశం మీదే మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు బన్నీ వెళ్లిన సదరు అభ్యర్థి తమకి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కాగా అల్లు అర్జున్ ఇచ్చిన మాట మేరకే అతని కోసం వెళ్ళాడు అని తెలుస్తుంది. సో ఇక్కడ తన ఫ్రెండ్ ఇప్పుడు ఉన్న పొలిటికల్ పార్టీ కాకుండా వేరే పార్టీ అయినా కూడా ఇదే చేసేవాడు కదా! ఇలా చాలా తక్కువమంది ఆలోచిస్తున్నారు.
మొత్తానికి ఈరోజు నడిచిన సస్పెన్స్ కి అల్లు అర్జున్ తన సైడ్ నుంచి ఏ పార్టీ కోసం తాను రాలేదు అని కేవలం తన స్నేహితుడి కోసమే వచ్చాను అని క్లియర్ చేసేసాడు. మరి ఇకనైనా తమకి అనుగుణంగా మార్చుకున్న వారంతా ఆగుతారో లేదో చూడాలి.