పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. యంగ్ హీరోయిన్స్ శ్రీలీల అలాగే రాశిఖన్నా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ కి ఆడియెన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే ఈ సినిమా ఎప్పుడో మొదలైంది ఫైనల్ గా ఇప్పుడు విడుదలకి వచ్చింది.
ఇక ఈ సినిమాలో ఆ మధ్య వచ్చిన పొలిటికల్ తరహా డైలాగ్స్ తో సినిమాల్లో కూడా ఇవి అవసరమా అనే కామెంట్స్ వినిపించాయి. ఇక ఇదే పంథా సినిమా మొత్తం ఉంటే ఫ్యాన్స్ వరకు ఓకే కానీ మిగతా ఆడియెన్స్ కి ఇవి నచ్చవు. సినిమాకు వెళ్లేదే ఎంటర్టైన్ అవ్వడానికి ఒకవేళ పొలిటికల్ సబ్జెక్ట్ అయితే అది వేరే అనుకోవచ్చు. సో దీనిపై ఫైనల్ గా హరీష్ క్లారిటీ ఇచ్చారు. కేవలం ఆ గ్లాస్ డైలాగ్ తప్ప వేరే ఉండవు అని తెలిపారు.
అయితే ఇది ఏ మేరకు సినిమాకి ప్లస్ అవుతుంది అనేది చూడాలి. పవన్ పాలిటిక్స్ లోకి వచ్చాక సినిమాల్లో ఈ పొలిటికల్ అంశాలు పెడుతూ ఉండడం లాంటివి న్యూట్రల్ ఆడియెన్స్ లో అంత మంచి ఫీడ్ బ్యాక్ అందుకోలేదు. సో ఇప్పుడు ఎలాగో ఉస్తాద్ లో ఇలాంటివి లేవు అంటున్నారు కాబట్టి ఇది దాదాపు ప్లస్ అవుతుంది అని అనుకోవాలి. సో నెక్స్ట్ ట్రైలర్ చూస్తే అందరికీ ఓ క్లారిటీ రావొచ్చు.
