ఈ శుక్రవారం డెబ్యూ దర్శకులు హిట్ అందుకునేనా!

చాలా రోజులు తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర కాస్త బజ్ తో పలు చిత్రాలు అయితే ఈ వారంలో థియేటర్స్ లోకి సినిమాలు వచ్చాయి. మరి ఈ చిత్రాల్లో అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత మళ్ళీ కామెడీ ట్రాక్ లోకి వచ్చి చేసిన చిత్రం “ఆ ఒక్కటీ అడక్కు” అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ హీరోగా నటించిన ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ చిత్రం “ప్రసన్న వదనం” కూడా ఒకటి.

అయితే ఈ రెండు సినిమాలతో హిట్స్ అందుకోవాలని హీరోలకి ఎలా ఉంటుందో ఈ సినిమాలతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్న దర్శకులకి కూడా టెస్ట్ అని చెప్పాలి. ప్రసన్న వదనంతో దర్శకుడు సుకుమార్ శిష్యుడు అర్జున్ వై కె పరిచయం కాబోతుండగా ఆ ఒక్కటీ అడక్కు తో మల్లి అంకం కూడా దర్శకునిగా పరిచయం అవుతున్నాడు.

దీనితో ఈ శుక్రవారం ఇద్దరు డెబ్యూ దర్శకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాలకి డీసెంట్ బజ్ ఉంది. మరి వీటితో ఈ ఇద్దరు దర్శకులు హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

Exit mobile version