“వాథి” ధనుష్ కెరీర్ లోనే రికార్డు ఓపెనర్ గా నిలుస్తుందా?

Published on Feb 16, 2023 11:00 pm IST


ప్రస్తుతం మన టాలీవుడ్ మరియు కోలీవడ్ సినిమా దగ్గర మంచి ఆసక్తిగా చాలా పాజిటివ్ బజ్ తో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రం “వాథి”. గ్లోబల్ హీరో ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రం తోనే తెలుగులో కూడా మొదటిసారి ఎంట్రీ ఇస్తున్నారు. మరి తెలుగులో “సార్” పేరిట వస్తున్న ఈ సినిమాని దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించగా తమిళ్ మరియు తెలుగులో జరిగిన ఈవెంట్ లు సూపర్ సక్సెస్ అయ్యాయి.

అంతే కాకుండా ఈ సినిమాకి మాత్రం ధనుష్ గత చిత్రాలతో పోలిస్తే చాలా బెటర్ అంచనాలు ఏకకాలంలో తెలుగు సహా తమిళ్ లో ఏర్పడడం మరో ఇంట్రెస్టింగ్ అంశం. దీనితో ఈ సినిమాకి వచ్చే ఓపెనింగ్స్ పై ఆసక్తి నెలకొంది. అటు తమిళ్ సహా తెలుగులో కూడా ఈ సినిమాకి అయితే ధనుష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

ఆల్రెడీ నేడు ప్లాన్ చేసిన స్పెషల్ ప్రీమియర్స్ అన్నీ కూడా ఆల్ మోస్ట్ సూపర్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. మరి ఇలా ఓవరాల్ గా అయితే ఈ చిత్రం ధనుష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచే అవకాశం బాగా ఉంది. మరి ఇవెలా నమోదు అవుతాయో చూడాలి. ఇక ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :