‘విన్నర్’ మూడవరోజు కలెక్షన్ల వివరాలు !

27th, February 2017 - 12:23:11 PM


సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విన్నర్’ మంచి అంచనాల మధ్య గత శుక్రవారం విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 6. 4 కోట్ల షేర్ కొల్లగోట్టి రెండవ రోజు అదే జోరు కొనసాగించి మూడవరోజు నిన్న ఆదివారం కావడంతో స్పీడ్ ఇంకాస్త పెంచి మెరుగైన వసూళ్లు రాబట్టింది.
చిత్ర నిర్మాణ సంస్థ, పిఆర్ టీమ్ ల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఏ మూడు రోజులకు కలిపి నైజాం ఏరియాలో రూ. 3.32 కోట్లు, ఉత్తరాంధ్రలో 1. 17 కోట్లు, సీడెడ్ – 1. 76 కోట్లుకలెక్ష్ చేసింది.

అలాగే ఈస్ట్ గోదావరిలో రూ. 1.04 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 75 లక్షలు, కృష్ణాలో రూ. 68 లక్షలు, గుంటూరులో రూ. 86 లక్షలు, నెల్లూరులో రూ. 36 లక్షలు తో పాటు మొత్తం ఏపీ, తెలంగాణల్లో 9.84కోట్లు కర్ణాటక,ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో కలిపి 1. 3 కోట్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 11. 15 కోట్ల షేర్ వసూలు చేసింది. ధరమ్ తేజ్ కెరీర్లో ఇవే ఉత్తమమైన వసూళ్లు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జిలు సంయుక్తంగా నిర్మించారు.