తెలుగు రాష్ట్రాల్లో ‘విజిల్’ హవా

whistle

మాస్ కంటెంట్ ఉన్న సినిమా ప్రేక్షకులకు సరైన రీతిలో కనెక్ట్ అయితే ఆ ఫలితమే వేరుగా ఉంది. తాజాగా విడుదలైన విజయ్, అట్లీల ‘విజిల్’ చిత్రమే ఇందుకు నిదర్శనం. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ బి, సి సెంటర్ల ప్రేక్షకులకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమాపై బ్రహ్మాండమైన వసూళ్లు సాధిస్తోంది.

తొలిరోజు రెండున్నర కోట్లకు పైగా షేర్ అందుకున్న ఈ సినిమా రెండు, మూడవ రోజుల్లో కూడా అదే జోరు కనబర్చింది. దీపావళి పండుగ రెండు రోజులు చిత్రానికి బాగా కలిసొచ్చింది. ఫలితంగా మూడు రోజులకు చిత్రం రూ.6.50 కోట్ల షేర్, రూ.10.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ మేరకు బ్రేక్ ఈవెన్ చేరాలంటే రూ.10 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సి ఉంది. సినిమా రన్ చూస్తుంటే నెక్స్ట్ వీకెండ్ నాటికి పది కోట్ల షేర్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version