“భీమ్లా” హైప్ కి చిన్న బ్రేక్ ఇచ్చినా బ్లాస్ట్ అదిరింది..!

Published on Nov 7, 2021 11:44 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. మాస్ లో విపరీతమైన అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ పవర్ ఫుల్ మాస్ సాంగ్ “లాలా భీమ్లా” ని చిత్ర యూనిట్ ఈరోజు రిలీజ్ కి ప్లాన్ చేశారు.

ఈ 11 గంటల 7 నిమిషాలకు సాంగ్ ఫిక్స్ చెయ్యగా ఎన్నో ప్లాన్స్ తో భారీ హైప్ తో పవన్ ఫ్యాన్స్ మ్యూజిక్ లవర్స్ దీని కోసం ఎదురు చూడగా దానిని ఊహించని బ్రేక్ పడింది. కొన్ని టెక్నీకల్ ఎర్రర్స్ కారణంగా సాంగ్ ఆగినా నెక్స్ట్ కొన్ని నిమిషాల్లోనే ఈ మాస్ బ్లాస్టర్ ని రిలీజ్ చేసారు. ఉన్న హైప్ కి తగ్గట్టుగా ఈ సాంగ్ వేరే లెవెల్ మాస్ లో వచ్చింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ సాంగ్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నే సాహిత్యం ఇవ్వడం గమనార్హం. మరి ఈ మోస్ట్ అవైటెడ్ మాస్ సాంగ్ లెక్క ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More