స్ట్రాంగ్ లైనప్ తో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు వస్తున్న “ఆహా”

Published on Oct 24, 2021 2:00 pm IST

ప్రస్తుత కాలంలో ఓటిటి రంగం ఎంతలా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కూడా పాపులర్ అయ్యినటువంటి అనేక ఓటిటి ప్లాట్ ఫామ్స్ గట్టి పోటీ నడుమ మొట్ట మొదటి సారిగా తెలుగు నుంచి వచ్చిన స్ట్రీమింగ్ యాప్ “ఆహా”. దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ యాప్ స్టార్టింగ్ నుంచి కూడా ఫ్రెష్ కంటెంట్ ను ముఖ్యంగా తెలుగు నుంచి ఎవ్వరూ ఇవ్వని కంటెంట్ ను వీరు అందిస్తున్నారు.

ఇక డే బై డే అయితే మరింత ఆసక్తికర కంటెంట్ ను ఇచ్చేందుకు స్ట్రాంగ్ లైనప్ తో ఆహా వారు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ టాలీవుడ్ లేటెస్ట్ అండ్ రీసెంట్ హిట్స్ “లవ్ స్టోరీ”, “ఇచట వాహనములు నిలుపరాదు” మరియు “ఎస్ ఆర్ కళ్యాణమండపం” చిత్రాలు అందుబాటులోకి తీసుకు రాగా రానున్న రోజుల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’, ‘గని’, ‘రొమాంటిక్’ అలాగే ‘మంచి రోజులొచ్చాయ్’, ‘అనుభవించు రాజా’ ఇంకా ‘లక్ష్య’ వంటి టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాలు కూడా ఆహా నుంచే అందుబాటులోకి రానున్నాయి.

ఇక వీటన్నిటినీ మించి నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న “అన్ స్టాప్పబుల్” అనే టాక్ షో కూడా ఉంది. ఇలా స్ట్రాంగ్ లైనప్ తో ఆహా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :

More