స్టన్నింగ్ వీడియోతో అఖిల్ “ఏజెంట్” రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Feb 4, 2023 2:21 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రానున్న పాన్ ఇండియా సినిమాల్లో ఎప్పుడు నుంచి సాలిడ్ హైప్ ఉన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “ఏజెంట్” కూడా ఒకటి. యంగ్ అండ్ డాషింగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా మన టాలీవుడ్ మాస్ అండ్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ చిత్రం ఇది కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అత్యంత ఆసక్తిగా మారుతూ వస్తుంది.

కానీ ఫైనల్ గా ఈ అవైటెడ్ రిలీజ్ పై మేకర్స్ ఇప్పుడు సెన్సేషనల్ అప్డేట్ ఓ స్టన్నింగ్ వీడియో తో అందించారు. ఆల్రెడీ ఈ సినిమాలో ఓ సరికొత్త అఖిల్ ని తన మేకోవర్ పరంగా మాత్రమే కాకుండా తన పెర్ఫామెన్స్ పరంగా కూడా చూడబోతున్నామని అర్ధం అయ్యింది. మరి ఈ వీడియో లో ఓ నటుడుగా అఖిల్ అద్భుతంగా కనిపించాడు.

పైగా తన రోల్ లో ఎంతవరకు అయినా వెళ్ళగలను అనే విధంగా డేరింగ్ అటెంప్ట్ నే తన ఒంటి మీద బట్టల్లేకుండా చేసాడు ఇది చాలా తక్కువ మందే చేస్తారు. మరి ఈ ఇంటెన్స్ వీడియో సూపర్బ్ గా వర్కౌట్ కాగా ఇందులో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఆ అప్డేట్ ఇచ్చేసారు. సో మొత్తానికి ఫ్యాన్స్ అంతా ఆరోజుకి డేట్ లాక్ చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :