“ఆచార్య” తో తన ఫస్ట్ ఎవర్ రికార్డ్ అందుకున్న మెగాస్టార్.!

Published on Apr 15, 2022 7:04 am IST


ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ క్రేజీ మల్టీస్టారర్ చిత్రం “ఆచార్య” కోసం తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తీసిన ఈ భారీ బడ్జెట్ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. మరి ఈ గ్యాప్ లో చిత్ర యూనిట్ ఓ మాసివ్ ట్రైలర్ కట్ ని రిలీజ్ చెయ్యగా దానికి ఆల్ టైం రికార్డు రెస్పాన్స్ కూడా వచ్చింది.

అయితే ఈ సినిమా ట్రైలర్ కేవలం వ్యూస్ పరంగా మాత్రమే కాకుండా లైక్స్ లో కూడా మెగా స్టార్ సినిమాల్లో ఏ సినిమాకి రాని రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అయితే ఈ ట్రైలర్ కూడా ఒక ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ వీడియో గా రికార్డు సెట్ చేసింది.

ఇక అలాగే మన సీనియర్ స్టార్ హీరోస్ లో ఫస్ట్ టైం మెగాస్టార్ ఈ రికార్డు ని అందుకున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్ లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :