“ఆదిపురుష్” ఫస్ట్ లుక్ తో నేషనల్ వైడ్ సోషల్ మీడియా షేక్.!

Published on Sep 30, 2022 9:59 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “ఆదిపురుష్”. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేసిన ఈ హిందీ సహా తెలుగు ప్రాజెక్ట్ నుంచి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. ఆ రాఘవ రామునిగా ప్రభాస్ ఎలా ఉంటాడో అని చాలా ఆసక్తిగా అంతా ఎదురు చూసారు.

బాహుబలి లాంటి ఎపిక్ రోల్ తర్వాత ఏకంగా రామ అవతారం అనేసరికి అంచనాలు కూడా నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్లగా పర్టిక్యులర్ గా ఆ ఫస్ట్ లుక్ కోసమే ఇన్నాళ్లు పాన్ ఇండియా సినిమా ఎదురు చూసింది. ఇక ఫైనల్ గా అయితే ఈ ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ కాగా తెల్లవారుతోనే సోషల్ మీడియా షేక్ అయ్యిపోయింది.

పాన్ ఇండియా సినీ వర్గాలు కూడా ఈ ఫస్ట్ లుక్ కోసమే ఆసక్తిగా మాట్లాడుకుంటుండగా ట్విట్టర్ లో అయితే ఆదిపురుష్ మరియు ప్రభాస్ పేర్లే ఇండియన్ వైడ్ ట్రెండింగ్ గా నిలిచాయి. మొత్తానికి అయితే ఆదిపురుష్ ప్రకంపనలు భారీ స్థాయిలో ఉన్నాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :