టాక్..”అఖండ” తో కళ్యాణ్ భారీ సినిమా రిలీజ్ డేట్..?

Published on Nov 17, 2021 7:02 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “అఖండ”. బోయపాటి శ్రీను మరియు బాలయ్య ల మధ్య వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో భారీ స్థాయి అంచనాలు దీనిపై నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం వచ్చే డిసెంబర్ 2 ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

బాలయ్య కెరీర్ లోనే హై లెవెల్ రిలీజ్ బహుశా ఇది. అయితే ఈ రిలీజ్ తో ఇంకో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చెయ్యనున్నాడట. అఖండ రిలీజ్ తో నేరుగా థియేటర్స్ లో కళ్యాణ్ రామ్ భారీ సినిమా “బింబిసారా” డేట్ రానుంది అని టాక్. వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అత్యధిక వ్యయంలో టైం ట్రావెల్ మరియు పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుంది. మరి దీని డేట్ కూడా డిసెంబర్ లోనే ఉండొచ్చట. మరి అదెప్పుడు ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More