వింటేజ్ బాలయ్యని గుర్తు చేసిన “అఖండ” లో స్పెషల్ సాంగ్.!

Published on Nov 28, 2021 7:06 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ సినిమా స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “అఖండ”. మాస్ ఆడియెన్స్ మరియు నందమూరి అభిమానుల్లో ఎనలేని హైప్ ఉన్న ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బాలయ్య మరియు బోయపాటి శ్రీను ల కాంబోలో ఇది హ్యాట్రిక్ సినిమా కావడంతో అంచనాలు కూడా వెరీ స్పెషల్ గానే ఉన్నాయి.

మరి వీటిని మ్యాచ్ చేస్తూ బోయపాటి తీసుకున్న జాగ్రత్తలు మాత్రం అమోఘం అని చెప్పి తీరాలి. ఈ చిత్రంలో యాక్షన్ నుంచి సంగీతం వరకు అన్నీ ఔట్ స్టాండింగ్ గా వచ్చాయి. ఇక నిన్న గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకతో రిలీజ్ చేసిన సూపర్ స్పెషల్ సాంగ్ ‘జై బాలయ్య’ అయితే మళ్లీ బాలయ్య అభిమానులకు పాత రోజులు తీసుకొచ్చింది. థమన్ అద్భుతమైన కంపోజిషన్, దానికి బాలయ్య వేసిన ప్రతీ సిగ్నేచర్ స్టెప్ అయితే టాప్ లేచి పోయేలా ఉంది. దీనితో సాంగ్ కి కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. మొత్తానికి మాత్రం అందరికీ సూపర్ ఫీస్ట్ ఇచ్చే విధంగా ఈ సినిమా రెడీగా ఉన్నట్టు అర్ధం అవుతుంది. ఇక అదెలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే డిసెంబర్ 2వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :