సీసీఎల్ : “ఏజెంట్” మాస్ ఇన్నింగ్స్ తో ఛాంపియన్స్ వార్ వన్ సైడ్ చేసేసిన టాలీవుడ్.!

Published on Mar 26, 2023 7:11 am IST

ఇండియన్ ఆడియెన్స్ కి ఎంతో ఇష్టమైన రెండు ఇంట్రెస్టింగ్ అంశాలు సినిమా అలాగే క్రికెట్.. ఈ రెండు కలయికలో చేసిందే సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ కాగా దాదాపుగా ఎన్నో ఏళ్ళు తర్వాత ఈ ఏడాది స్టార్ట్ చేసిన సీజన్ లో దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల క్రికెట్ టీం లు పాల్గొన్నాయి. మరి అలాగే మన టాలీవుడ్ నుంచి కూడా యంగ్ క్రికెట్ టీం “ఏజెంట్” అఖిల్ సారథ్యం లో మొదటి ఆట నుంచే దూకుడు కనబర్చగా మొన్న కర్ణాటక టీం తో శ్రీకాంత్ తనయుడు రోషన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ల సాలిడ్ ఇన్నింగ్స్ తో నిన్న ఫైనల్స్ కి తెలుగు వారియర్స్ టీం చేరుకుంది.

మరి భోజ్ పూరి ఇండస్ట్రీ తో పడిన ఈ మ్యాచ్ లో మన టీం నుంచి అద్భుతమైన బౌలింగ్ తో పాటుగా బాటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో క్లిక్ అవ్వడంతో వార్ వన్ సైడ్ చేసేసారు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో అయితే సునాయాసంగా హాఫ్ సెంచరీ చేసిన అఖిల్ మాస్ బ్యాటింగ్ తో భారీ స్కోరును టాలీవుడ్ టీం కి అందించాడు. దీనితో ఆ స్కోర్ మూలన రెండో ఇన్నింగ్స్ లో తాను క్రీజ్ లో దిగకుండానే మిగతా వాళ్ళ బాటింగ్ తోనే మ్యాచ్ విన్ అయ్యి తెలుగు వారియర్స్ మరోసారి ఛాంపియన్ గా నిలిచింది.

మరి ఈ లాస్ట్ మ్యాచ్ నటుడు రఘు తన ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్ తో అందరినీ ఆశ్చర్య చకితులను చేసాడు. అలాగే లాస్ట్ ఇన్నింగ్స్ లో హిడింబ అశ్విన్ బాబు కూడా చాలా కీలకమైన బాటింగ్ అందించాడు. మరి వైజాగ్ లో జరిగిన ఈ ఫైనల్స్ కి వెంకీ మామ కూడా రావడం విశేషం అంతే కాకుండా మ్యాచ్ విన్నింగ్ షాట్ వరకు ఉండి టీం తో ఈ విజయాన్ని తాను సెలెబ్రెట్ చేసుకున్నారు.

సంబంధిత సమాచారం :