ఇంటెన్స్ గా “రావణాసుర” కొత్త లుక్..రిలీజ్ డేట్ కూడా ఫిక్స్.!

Published on Jan 14, 2022 11:29 am IST

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ప్రస్తుతం పలు సాలిడ్ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఇదే సంక్రాంతి బరిలో తన “క్రాక్” సినిమాతో వచ్చి తన కెరీర్ లోనే భారీ హిట్ అండ్ సాలిడ్ కం బ్యాక్ అందుకున్న రవితేజ దాని తర్వాత వరుస సినిమాలు దేనికదే డిఫరెంట్ గా ఓకే చేసి మళ్ళీ సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

మరి ఇదిలా ఉండగా ఈరోజు భోగి పర్వదినాన తన మరో సినిమా అధికారిక ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యడమే కాకుండా రిలీజ్ డేట్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. దర్శకుడు సుధీర్ వర్మతో ప్లాన్ చేసిన చిత్రం “రావణాసుర” ను ఈరోజు మెగాస్టార్ సారథ్యంలో గ్రాండ్ గా లాంచ్ చెయ్యడంతో పాటుగా రవితేజ సరికొత్త ఇంటెన్స్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

మరి దీనితో పాటుగా ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 30న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రంలో యంగ్ హీరో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా రవితేజ మరియు అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :