బ్యూటిఫుల్ ట్రైలర్ తో “మీట్ క్యూట్” రిలీజ్ డేట్ ఫిక్స్.!

బ్యూటిఫుల్ ట్రైలర్ తో “మీట్ క్యూట్” రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Nov 18, 2022 3:00 PM IST

నాచురల్ స్టార్ నాని సమర్పకునిగా తన బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా నుంచి వస్తున్న మొదటి ఓటిటి సిరీస్ “మీట్ క్యూట్”. తన సోదరి దీప్తి గంట తెరకెక్కించిన ఈ బ్యూటిఫుల్ అంథాలజీ సిరీస్ ని స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ వారు ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ కి తీసుకురాబోతున్నారు.

చాలా మంది యువ నటీనటులు సునైనా, రుహాణి శర్మ, అదా శర్మ, నటుడు సత్యరాజ్ తదితరులు నటించిన ఈ సిరీస్ నుంచి గత కొన్ని రోజులు కితమే ఓ బ్యూటిఫుల్ టీజర్ రాగా ఇప్పుడు మేకర్స్ అయితే ట్రైలర్ ని రిలీజ్ చేసారు. మరి ఇందులో అసలు తమ “మీట్ క్యూట్” అంటే ఏంటో వివరిస్తూ ఒకో పాత్ర వారి పరిచయాలు వారి మధ్య ఎమోషన్స్ ని బ్యూటిఫుల్ గా చూపించారు.

అలాగే ఇందులో వసంత్ కుమార్ ఇచ్చిన మ్యూజిక్ మరింత అందం తీసుకురాగా ఆడియెన్స్ కి అయితే ఓ ఫ్రెష్ ఫీల్ ని ఈ ట్రైలర్ అందించింది. ఇక ఈ సిరీస్ అయితే మేకర్స్ ఈ నవంబర్ 25 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంచనున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సిరీస్ అయితే ఎలా ఉండనుందో వేచి చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు