మెగాస్టార్ తో ఫస్ట్ డే షూట్ పై డైరెక్టర్ ఫుల్ హ్యాపీ !

మెగాస్టార్ తో ఫస్ట్ డే షూట్ పై డైరెక్టర్ ఫుల్ హ్యాపీ !

Published on Nov 15, 2021 10:00 AM IST

టాలెంటెడ్ డైరెక్టర్ మెహ‌ర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ మొదటి రోజు షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఫస్ట్ డే షూట్ బాగా జరిగిందని మెహ‌ర్ రమేష్ పెద్దమ్మతల్లి టెంపుల్ కి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ఆ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక చిన్న మెసేజ్ కూడా పోస్ట్ చేస్తూ… ‘పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో మొదటి రోజు షూటింగ్ బాగా జరిగింది’ అని మెసేజ్ చేశారు.

ఇక మెగాస్టార్ తన కెరీర్ లో ‘భోళా శంకర్’ పాత్ర కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. ఆ మధ్య చిరు గుండు లుక్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ లుక్ ఈ సినిమాలోదేనట. ఇక మెహ‌ర్ ర‌మేష్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ ను బాగా డిజైన్ చేశాడు. కథలోని మెయిన్ ఎమోషన్స్ ను అద్భుతంగా వచ్చాయట.

కాగా హీరోలను స్టైలిష్ గా చూపించడంలో మెహర్ రమేష్ కి మంచి టాలెంట్ ఉంది. మరీ మెగాస్టార్ ను మెహర్ రమేష్ ఎంత కొత్తగా చూపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు