సీడెడ్ తో కలిపి తెలుగు స్టేట్స్ లో “రాధే శ్యామ్” టోటల్ ఫస్ట్ డే వసూళ్ల లెక్కలు!

Published on Mar 12, 2022 7:10 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి వసూళ్ళని అందుకొని బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. మరి ఇదిలా ఉండగా ఆల్రెడీ నైజాం లో ఈ చిత్రం ఆల్రెడీ 10.85 కోట్ల షేర్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏపీలోని కీలక ప్రాంతాలు సహా టోటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు షేర్ తెలుస్తుంది.

మరి ఈ సినిమా మొదటి రోజు సీడెడ్ లో 3.65 కోట్లు షేర్ అందుకోగా రెస్ట్ ఆంధ్ర లో 11.5 కోట్ల షేర్ ని అందుకుంది. దీనితో ఏపీ మరియు ఆంధ్ర లో కలిపి ఈ చిత్రం ఫస్ట్ డే రాధే శ్యామ్ 26 కోట్ల షేర్ ని రాబట్టి సాలిడ్ నెంబర్ ని నమోదు చేసింది. మరి ఆల్రెడీ ఈ శని ఆదివారాలు కూడా గట్టి హోల్డ్ నే రాధే శ్యామ్ కనబరుస్తుందట. దీనితో ఈ మూడు రోజుల్లో మరిన్ని గట్టి నెంబర్స్ నే ఈ సినిమా అందుకుంటుంది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :