హిందీలో సైతం మార్కెట్ పరిధిని పెంచుకుంటున్న బన్నీ !

7th, May 2017 - 12:24:49 PM


గతేడాది ‘సరైనోడు’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ఈ సంవత్సరం హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో బన్నీ తన మార్కెట్ పరిధిని బాలీవుడు స్థాయికి విస్తరించాడు. తాజాగా సినీ వర్గాల నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం డీజే హిందీ డబ్బింగ్ హక్కులు రూ. 7 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది.

ఈ మొత్తంతో బాహుబలిని మినహాయిస్తే హిందీ హక్కుల విషయంలో బన్నీ మూడవ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో రూ. 28 కోట్లకు అమ్ముడైన మహేష్ బాబు ‘స్పైడర్’ ఉండగా రెండవ స్థానంలో రూ. 8. 2 కోట్లకు అమ్ముడైన పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఉంది. ఇలా ఒక్కసారిగా అల్లు అర్జున్ సినిమా హిందీ రైట్స్ ఇంత పెద్ద మొత్తం పలకడం చూస్తే తెలుగు సినిమాలకు బాలీవుడ్ లో క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ఊహించవచ్చు. ఇకపోతే బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 23న రిలీజ్ చేయనున్నారు.