“గాలోడు” తో మరింత పవర్ చూపించిన సుడిగాలి సుధీర్.?

“గాలోడు” తో మరింత పవర్ చూపించిన సుడిగాలి సుధీర్.?

Published on Nov 19, 2022 5:00 PM IST

తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర పాపులర్ ఎంటర్టైనింగ్ ఛానెల్ ఈటీవీలో ప్రసారం అయ్యే “జబర్దస్త్” కామెడీ షో కోసం తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ షో ద్వారా బుల్లితెర మీద గట్టి క్రేజ్ తెచ్చుకున్న నటుడు సుడిగాలి సుధీర్. మరి సుధీర్ హీరోగా మారడానికి కూడా ఈటీవీ ప్రోగ్రాం లే చాలా దోహదపడగా యూత్ లో అయితే తన క్రేజ్ ఇంట్రెస్టింగ్ గా పెరుగుతూ వస్తుందని చెప్పొచ్చు.

అయితే తన మొదటి సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్ తోనే తాను సత్తా చాటగా లేటెస్ట్ గా మాస్ చిత్రం “గాలోడు” తో మాత్రం మరింత పవర్ చూపించినట్టు తెలుస్తుంది. అయితే మొదటిరోజు పలు చోట్ల బెటర్ ఓపెనింగ్స్ నే రాబట్టాడని కూడా సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా అయితే తన సినిమా ట్యాగ్ 14 వేలకి పైగా ట్వీట్స్ తో ట్రెండింగ్ లో కూడా కనిపిస్తుండడం విశేషం. మరి దీనితో అయితే సుధీర్ సినిమా పరంగా మరింత గ్రోత్ అందుకున్నాడని చెప్పొచ్చు. కాకపోతే మరింత మంచు సబ్జెక్టులు ఎంచుకుంటే మరింత ఎత్తుకు తాను వెళ్లే ఛాన్స్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు