తన షోకి ఆల్ టైం బెస్ట్ రేటింగ్ సెట్ చేసి పెట్టిన తారక్.!

Published on Dec 17, 2021 12:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా సూపర్ హిట్ అయ్యిన సంగతి అందరికీ తెలుసు. అప్పుడు తెలుగు బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బిగ్ బాస్ కి హోస్ట్ గా వచ్చి రికార్డు టీఆర్పీ రేటింగ్ సెట్ చేసిన యంగ్ టైగర్ మళ్ళీ చాలా కాలం తర్వాత హోస్ట్ గా ఇంకో గ్రాండ్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” తో పలకరించారు.

అయితే ఈ షోకి కూడా తనదైన శైలి హోస్టింగ్ తో రికార్డు రేటింగ్ ని రాబట్టాడు తారక్. అంతే కాకుండా ఈ సరి షో ముగింపు తో అసలు ఈ ఫ్రాంచైజ్ లోనే అధిక యావరేజ్ రేటింగ్ నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది. ఈ షోకి గాను మొత్తం ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ రేటింగ్స్ తో కలిపి యావరేజ్ గా 4.04 రేటింగ్ వచ్చిందట. ఇది ఈ షో ఫ్రాంచైజ్ లోనే ఆల్ టైం అధికం అని తెలుస్తుంది. మరి దీనికి కారణం ఎంతో ఆహ్లాదంగా రక్తి కట్టించిన తారక్ వలనే అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :