“కల్కి” మ్యానియా.. బాలీవుడ్ సినిమా వాయిదా

“కల్కి” మ్యానియా.. బాలీవుడ్ సినిమా వాయిదా

Published on Jul 2, 2024 10:02 AM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్ అలాగే దిశా పటాని ఫీమేల్ లీడ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం అన్ని అంచనాలు అందుకొని భారీ వసూళ్లతో దుమ్ము లేపుతుంది. మరి ఇండియా వైడ్ గా ఇప్పుడు కల్కి మ్యానియా ఒక్కటే నడుస్తుండగా దీనితో నెక్స్ట్ వారంలో కూడా మరో సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

మెయిన్ గా నార్త్ లో కల్కి సాలిడ్ నంబర్స్ అందుకుంటుండగా ఈ వారం అక్కడ రిలీజ్ కావాల్సిన ఓ స్టార్ హీరో సినిమా వాయిదా వేసుకున్నట్టుగా వినిపిస్తుంది. మరి హీరో అజయ్ దేవగన్ అలాగే టబు నటించిన తాజా చిత్రం “ఔరోన్ మెయిన్ కహాన్ దం తా” అనే సినిమా కల్కి తర్వాతి వారంలో ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు ఈ చిత్రం వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది.

కల్కి ఎఫెక్ట్ ఈ సినిమాకి పడుతుంది అని అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సింది. ఇక ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహించగా ఫ్రైడే ఫిలిం వర్క్స్, ఎన్ హెచ్ స్టూడియోజ్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు