మణిశర్మ గ్రాండియర్ తో “శాకుంతలం” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

మణిశర్మ గ్రాండియర్ తో “శాకుంతలం” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Nov 4, 2022 11:00 AM IST

మన సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంతా మెయిన్ లీడ్ లో నటిస్తున్నటువంటి లేటెస్ట్ భారీ చిత్రాల్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ “శాకుంతలం” కూడా ఒకటి. మరి భారీ సెట్టింగ్స్, పీరియాడిక్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది.

అయితే ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొనగా మేకర్స్ అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. మరి ఓ ఇంట్రెస్టింగ్ మోషన్ పోస్టర్ టీజర్ ని అయితే రిలీజ్ చేసి ఈ చిత్రాన్ని కూడా 3డి లో కొత్త రిలీజ్ డేట్ ని అతి త్వరలోనే అనౌన్స్ చేస్తున్నట్టు మరోసారి కన్ఫర్మ్ చెయ్యగా..

ఇందులో మాత్రం భారీ సెట్టింగ్స్ తో పాటుగా సంగీత దర్శకుడు మణిశర్మ ఇచ్చిన నేపథ్య గీతం ఈ చిత్రానికి మరింత గ్రాండియర్ తెచ్చి పెట్టేలా అనిపిస్తుంది. అలాగే చాలా కాలం తర్వాత మణిశర్మ నుంచి ఇలాంటి గ్రాండియర్ ట్యూన్ వినడం కూడా తన ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అని కూడా చెప్పొచ్చు. ఇక ఈ భారీ చిత్రాన్ని దిల్ రాజు గుణ టీం వర్క్స్ వారు నిర్మాణం వహిస్తుండగా దేవ్ మోహన్ మేల్ లీడ్ లో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు