రాజమౌళి మ్యాజిక్..తారక్, చరణ్ లకు యూనానిమస్ అప్లాజ్.!

Published on Nov 27, 2021 3:08 pm IST

ప్రతి ఒక్క నటుని నుంచి అద్భుతమైన ఎమోషన్స్ ని రాబట్టగల టాలీవుడ్ టాప్ దర్శకులలో రాజమౌళిది ప్రత్యేక స్థానం. తన సినిమాలో అంత బలంగా అద్భుతమైన భావోద్వేగాలను రాజమౌళి చూపించడం వల్లనే విజువల్స్ కన్నా ఇవి ఎక్కుగా హైలైట్ అయ్యిన సందర్భాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఇది ఒకింత తన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” లో ఎక్కువే ఉందని చెప్పాలి. నిన్న విడుదల చేసిన ‘జనని’ సాంగ్ చూసిన తర్వాత ప్రతీ ఒక్కరూ కూడా అల్లూరిగా చేసిన రామ్ చరణ్ కోసం కొమరం భీం గా చేసిన ఎన్టీఆర్ లు పండించిన ఎమోషన్స్ కోసమే పెద్ద ఎత్తున నిన్నటి నుంచి చర్చ జరుగుతుంది.

వారు ఆ సాంగ్ లో కనిపించిన ప్రతీ విజువల్ కూడా ఎంతో భావోద్వేగంతో కూడుకొని కనిపించాయి. అయితే దీని అంతటికీ దాని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ రాజమౌళి మ్యాజిక్ అనే చెప్పాలి. దీనితో ఇద్దరి హీరోలకి కూడా సమానంగా అందరి నుంచి అన్ని సినీ వర్గాల ఆడియెన్స్ నుంచి యూనానిమస్ అప్లాజ్ వస్తుంది.

మరి ఈ సాంగ్ లో కనిపించిన విజువల్స్ కే ఇలా ఉంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :