“RRR” ఎఫెక్ట్..ఇంటర్నేషనల్ వైడ్ రామ్ చరణ్ కి సాలిడ్ రీచ్.!

“RRR” ఎఫెక్ట్..ఇంటర్నేషనల్ వైడ్ రామ్ చరణ్ కి సాలిడ్ రీచ్.!

Published on Jun 5, 2022 4:26 PM IST


లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హిట్ గా నిలిచిన చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టగా ఇప్పుడు ఓటిటి లో రిలీజ్ అయ్యాక ప్రపంచ స్థాయిలో మరింత రెస్పాన్స్ ని చాలా ఎక్కువగా అందుకుంటుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాపై అనేక దేశాలకి చెందిన వీక్షకులు అలాగే పలువురు మీడియా సినీ ప్రముఖులు కూడా పలు దేశాల నుంచి తమ ఎగ్జైటింగ్ రెస్పాన్స్ ని అందిస్తున్నారు. అయితే చాలా వరకు ఆడియెన్స్ నుంచి ఎన్టీఆర్ తో పాటుగా రామ్ చరణ్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఒకింత ఎక్కువ మాత్రం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పై కనిపిస్తుండడం గమనార్హం.

చరణ్ చేసిన రామ రాజు రోల్ గాని అందులో చరణ్ లుక్స్, తన బాడీ, పెర్ఫామెన్స్ లు కోసం చాలా మంది అత్యంత ఆసక్తిగా తమ ఎగ్జైట్మెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఇంటర్నేషనల్ వైడ్ అయితే చరణ్ కి మంచి రీచ్ దక్కింది అని చెప్పాలి. మరి చరణ్ అయితే తన తదుపరి సినిమాలను కూడా కరెక్ట్ గా సెట్ చేసుకుంటే పాన్ ఇండియా నుంచి ఇతర ఆడియెన్స్ లో కూడా వాటికి మంచి ఆదరణ దక్కుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు