అఫీషియల్ : మనిషంత గన్.. పవన్, సుజీత్ కాంబోలో సెన్సేషనల్ ప్రాజెక్ట్.!

Published on Dec 4, 2022 9:03 am IST

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ తన సినీ కెరీర్ లో మళ్ళీ ఇది ఓ పీక్ స్టేజి అని చెప్పొచ్చు. ఇప్పుడు జస్ట్ అనౌన్సమెంట్ లతోనే పవన్ క్రేజీ అప్డేట్స్ అందిస్తుండగా ఈ సినిమా స్ట్రైట్ సినిమాలు అని రావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈరోజు ఉదయం దిగ్గజ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఓ భారీ అనౌన్సమెంట్ రానుంది అని తెలియడం అది పవన్ మరియు యంగ్ దర్శకుడు సుజీత్ సినిమా నుంచే అని టాక్ రావడం కూడా జరిగింది.

అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అయ్యిపోయింది. మరి ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో అయితే ఈ సినిమా ఇప్పుడు అనౌన్స్ కాగా ఈ చిత్రాన్ని సుజీత్ నే రచన దర్శకత్వం అందిస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అలాగే పోస్టర్ లో కొన్ని జాపనీస్ పేర్లు అలాగే హ్యాష్ ట్యాగ్ తో “ఓజి” అంటూ హైలైట్ చేశారు.

అలాగే పవన్ నిల్చున్న పోస్టర్ చూస్తే ఓ గన్ కూడా కనిపిస్తుండడం కేజ్రీగా ఉంది. అలాగే పవన్ ఎదురుగా కొన్ని ఫేమస్ నిర్మాణాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఓ సెన్సేషనల్ సినిమానే మేకర్స్ సెట్ చేసారని చెప్పాలి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రానున్నాయి.

సంబంధిత సమాచారం :