విపరీతమైన పాజిటివ్ బజ్ తో “లవ్ స్టోరీ” రిలీజ్.!

Published on Sep 24, 2021 8:00 am IST


అక్కినేని యువ హీరో నాగ చైతన్య హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కించిన చిత్రం “లవ్ స్టోరీ”. ఎప్పుడు నుంచో భారీ అంచనాలతో ఉన్న ఈ చిత్రం టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా కమ్ముల మ్యాజికల్ టేకింగ్ ఇంకా ఇద్దరు నటీనటుల పెర్ఫామెన్స్ లు కోసం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈరోజు చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ముందుకన్నా విపరీతమైన పాజిటివ్ బజ్ నెలకొంది అని చెప్పాలి. టాలీవుడ్ నుంచి ఎందరో సినీ తారలు ఈ సినిమాకి మేకర్స్ ని విషెష్ చెప్పగా తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు ఆల్ ది బెస్ట్ చెప్పడం గమనార్హం. అంతే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ సినిమాకి చాలా పాజిటివ్ రిపోర్ట్స్ నే వస్తున్నాయి. మరి ఫుల్ ఫ్లెడ్జ్ గా సినిమా ఎలా ఉంటుందో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది అప్పటి వరకు అంతా ఎదురు చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :