“ఎక్స్ట్రా జబర్దస్త్” షోలో ఎమోషనల్ ట్విస్ట్..సుడిగాలి సుధీర్ టీం బయటకు..

Published on Dec 7, 2021 9:19 pm IST

తెలుగు బుల్లితెరపై ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే సూపర్ హిట్ షోస్ లో మోస్ట్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రాం “జబర్దస్త్” కోసం అందరికీ తెలిసిందే. మరి దానికి సక్సెసర్ గా మొదలైన షో నే “ఎక్స్ట్రా జబర్దస్త్” అయితే ఇప్పుడు ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో బయటకి వచ్చింది. ఎప్పటికపుడు కొత్తరకం స్కిట్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ షో మళ్ళీ అలాంటి కొత్త రకం ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నట్టు అర్ధం అవుతుంది.

మొదటగా బుల్లెట్ భాస్కర్ స్కిట్ రోబో కాన్సెప్ట్ తో ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాకుండా అదే సమయంలో మంచి ఫన్ ని జెనరేట్ చేసింది. అలాగే ఆ తర్వాత కెవ్వు కార్తీక్, రాకేష్ – పండు, రష్మీ ల స్కిట్స్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ తో కనిపించాయి. ఇక తర్వాత సుడిగాలి సుధీర్ టీం మెంబర్స్ గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ మరియు సుధీర్ లు తమ కో టీం లీడర్స్ రాకెట్ రాఘవ, హైపర్ ఆదిల ఇంటికి వెళ్లి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

అయితే ఇలా మంచి ఫ్లో లో నవ్విస్తూ వెళ్లిన ఈ ప్రోమో ఒక్కసారిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ఇందులో తమకంటూ సెపరేట్ బెంచ్ మార్క్ ను సెట్ చేసుకున్న టీం గా సుడిగాలి సుధీర్ అండ్ టీం ఈ షో కి దూరం అవుతున్నట్టుగా స్టేజ్ పై నుంచే ఎంతో భావోద్వేగంతో చెప్పడం షాక్ ఇచ్చింది. దీనితో వీరి టీం అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు ఏం జరగనుందో అనేది తెలియాలి అంటే ఈ వచ్చే డిసెంబర్ 10 శుక్రవారం రాత్రి ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షో ని తప్పకుండ చూసి తీరాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :