ఈ కామెంట్స్ తో తారక్ అభిమానుల మనసు గెలుచుకున్న చరణ్.!

Published on Dec 28, 2021 11:01 am IST


మన టాలీవుడ్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఈ చిత్రం మూడేళ్ళ పాటు జరిగిన ఒక సుదీర్ఘ ప్రయాణం. అయితే అసలు ఈ సినిమా అనౌన్స్ అయ్యిన నాటి నుంచే ఇద్దరు బిగ్ స్టార్స్ అందులోని వారి ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేనిది.

అలాంటిది రాజమౌళి ఎలా ఈ ఇద్దరు హీరోలని డీల్ చేస్తారు? ముఖ్యంగా ఇరు హీరోల అభిమానులు ఎలా ఈ సినిమా విషయంలో అవతల హీరో పట్ల మనగలరు అనేవి ఆసక్తిగా మారిన అంశాలు. మరి ఈ కోణం లోనే ఓ హీరోని ఇంకో హీరో అభిమానులు తగ్గించుకోవడం ట్రోల్స్ చేసుకోవడం కామన్ గానే ఎన్నో జరిగాయి. కానీ వీటి అన్నిటికీ అతీతంగా మాత్రం ఈ ఇద్దరు హీరోలు ఒకరంటే ఒకరు ఎంతో గౌరవం కనబరుచుకున్నారు.

ముఖ్యంగా నిన్న అయితే తమిళ్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చరణ్ తారక్ ను ఉద్దేశించి తమకున్న సోదర బంధం కోసం చెప్పిన కామెంట్స్ అతడి పట్ల తారక్ అభిమానుల్లో అపారమైన గౌరవాన్ని తీసుకొచ్చాయి. తమ ఈ జర్నీ లో ఎన్టీఆర్ నాకు ఒక సోదరునిలా మారిపోయాడని ఈ బంధాన్ని తాను చనిపోయే వరకు మర్చిపోనని ఎంతో వినయంగా తెలియజేసాడు. దీనితో ఈ కామెంట్స్ ఎన్టీఆర్ అభిమానుల మనసుని గెలుచుకున్నట్టు కాగా ఎన్టీఆర్ అభిమానుల్లో ఇదే చర్చగా నడుస్తుంది.

సంబంధిత సమాచారం :