లేటెస్ట్..నైజాంలో ఈ డెసిషన్ తో “పుష్ప” డే 1 భారీగా ఉండడం ఖాయం.!

Published on Dec 16, 2021 4:00 pm IST

టాలీవుడ్ బాక్సాఫీస్ ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ “అఖండ” ర్యాంప్ తర్వాత అంతకు మించిన అంచనాలతో వస్తున్న క్రేజీ చిత్రం “పుష్ప ది రైజ్”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ మైండ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్లో అంతా ఎదురు చూస్తున్నారు.

మరి ఆల్రెడీ అన్ని చోట్లా కూడా సాలిడ్ బుకింగ్స్ జరుపుతున్న ఈ చిత్రం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ఓపెనింగ్స్ ని ఈ చిత్రం రాబట్టడం ఖాయం అని కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఏపీలో పరిస్థితులు ఇంకా క్లారిటీ లేవు కానీ నైజాం లో మాత్రం భారీ వసూళ్లు కొల్లగొట్టడం ఖాయం అని లేటెస్ట్ డెసిషన్ తో క్లారిటీ వచ్చేసింది. అక్కడి ప్రభుత్వం పుష్ప ఎక్స్ట్రా షోలకి అనుమతులు ఇచ్చారు. అంటే రోజుకి అక్కడ 5 షోలు వెయ్యనున్నారట. దీనితో పుష్ప నైజాం లో మాత్రం డే 1 రికార్డు ఫిగర్ నమోదు చెయ్యడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :