“సర్కారు వారి పాట” మళ్ళీ వాయిదాపై ఇదొక క్లారిటీ అనుకోవచ్చా.?

Published on Jan 16, 2022 10:31 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మరియు మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ కోసం మహేష్ అభిమానులు ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నిజానికి ఈ ఏడాది ఇదే సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ పలు కారణాల చేత ఈ విడుదల కాస్తా ఏప్రిల్ 1న రిలీజ్ కి మేకర్స్ ఫిక్స్ చేశారు. అయితే ఈ డేట్ కి కూడా మేకర్స్ రిలీజ్ చెయ్యకపోవచ్చనే ఊహాగానాలు కూడా తర్వాత వచ్చాయి కానీ అధికారిక క్లారిటీ అయితే లేదు. మరి ఇప్పుడు ఈ టాక్ బహుశా నిజమే కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎందుకంటే సరిగ్గా సర్కారు వారి పాట రిలీజ్ డేట్ ఏప్రిల్ 1 కే మెగాస్టార్ చిరు నటించిన అవైటెడ్ సినిమా “ఆచార్య” ఈరోజు అనౌన్స్ అయ్యింది అంటే ఈ స్లాట్ నుంచి మళ్ళీ సర్కారు వారి పాట తప్పుకున్నట్టే అనుకోవచ్చు. కాకపోతే దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. మరి వేచి చూడాలి దీనిపై అప్డేట్ ఏమన్నా వస్తుందో లేదో అనేది.

సంబంధిత సమాచారం :