“విక్రమ్” ఎఫెక్ట్..ఇప్పుడు ఆ సినిమాపై పడ్డ ఆడియెన్స్.!

Published on Jun 16, 2022 3:00 am IST

లేటెస్ట్ గా దక్షిణాది సినిమా దగ్గర భారీ హిట్ అయ్యిన మరో చిత్రం “విక్రమ్”. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో మరికొంతమంది యాక్టింగ్ డైనమైట్స్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ అలాగే సూర్య లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లను అందుకొని అన్ని చోట్లా సాలిడ్ హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యి ఆడియెన్స్ ని అంతలా మెప్పించడానికి కారణం దర్శకుడు చేసిన మ్యాజిక్ అని చెప్పాలి. తన లాస్ట్ సినిమా “ఖైదీ” కి దీనికి లింక్ చేస్తూ ఒక సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ కి తెర లేపగా ఆడియెన్స్ లో మరింత ఆసక్తి రేగింది.

అయితే ఖైదీ సినిమా చూడని వారి పరిస్థితి ఏంటి అంటే? ఇప్పుడు వారు అంతా ఖైదీ సినిమా చూడడం స్టార్ట్ చేస్తున్నారట. విక్రమ్ కి ఆ సినిమాకి ఎలా లింక్ ఉంది అనే విషయంలో ఖైదీ సినిమాని చూస్తుండడంతో ఇపుడు ఖైదీ చిత్రానికి భారీ రెస్పాన్స్ నమోదు అవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే “విక్రమ్” ఎఫెక్ట్ మళ్ళీ ఖైదీని చూసేలా చేస్తుంది.

సంబంధిత సమాచారం :