వైరల్ అవుతోన్న పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” వర్కింగ్ స్టిల్!

Published on Oct 4, 2021 8:23 pm IST

పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి, అనుకున్న సమయానికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ సరసన ఈ చిత్రం లో హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్ ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించిన మరొక వర్కింగ్ స్టీల్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ప్రకాష్ తో ఉన్నటువంటి పిక్ ను అభిమానులు లైక్ కొడుతూ, షేర్ చేస్తున్నారు. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సూర్య దేవర నాగ వంశీ నిర్మాత గా ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ గ్లింప్స్, మేకింగ్ వీడియో, ఫస్ట్ సింగిల్, డానియల్ శేఖర్ వీడియో సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం లో ఇద్దరు స్టార్ హీరోలు నటించడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :