వరల్డ్ ఆఫ్ గని: పాత్రలను పరిచయం చేస్తూ టీజర్ డేట్ ఫిక్స్ చేసిన టీమ్!

Published on Nov 11, 2021 3:01 pm IST

వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా గని. ఈ చిత్రం ను రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ ల పై సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదలై సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన పాత్రల పై, టీజర్ విడుదల తేదీ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

వరల్డ్ ఆఫ్ గని పేరిట ఒక వీడియో ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రం లో ముఖ్య పాత్రలు పోషిస్తున్న వారిని ఈ వీడియో లో చూపించడం జరిగింది. నదియా, నరేష్, తనికెళ్ళ భరణి, నవీన్ చంద్ర, సాయి మంజ్రేకర్, సునీల్ శెట్టి, జగపతి బాబు, ఉపేంద్ర లు నటిస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రం టీజర్ ను నవంబర్ 15 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. స్పోర్ట్స్ డ్రామా గా ఈ చిత్రం ఉండటం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుణ్ తేజ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :