వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “అరణ్య”

Published on Oct 19, 2021 6:10 pm IST


రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో ప్రభు సోలమన్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం అరణ్య. ఈ చిత్రం విడుదలై విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయింది. జీ తెలుగు ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలో జీ తెలుగు లో ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గావ్కర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించగా, శాంతను మోయిత్ర సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :