వరల్డ్ వైడ్ గా “దసరా” ఫస్ట్ డే సెన్సేషనల్ ఓపెనింగ్స్.!

Published on Mar 31, 2023 12:00 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో క్రేజీ బజ్ తో రిలీజ్ అయ్యిన లేటెస్ట్ సినిమా “దసరా”. నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ అగ్రెసివ్ ప్రమోషన్స్ నడుమ అయితే ఈ రామనవమి కానుకగా రిలీజ్ అయ్యింది.

మరి ఈ సినిమా అయితే ఆల్రెడీ భారీ ఓపెనింగ్స్ రాబడుతుంది అని అంతా ఫిక్స్ కాగా ఇప్పుడు అయితే అదే రేంజ్ లో సినిమా భారీ ఓపెనింగ్స్ ని వరల్డ్ వైడ్ అందుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి పి ఆర్ నంబర్స్ ప్రకారం అధికారిక పోస్టర్ తో ఈ సినిమా వరల్డ్ వైడ్ వసూళ్లు కన్ఫర్మ్ చేశారు.

ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా అయితే ఏకంగా 38 కోట్ల రికార్డు గ్రాస్ నమోదు అయ్యినట్టుగా తెలియజేసారు. మరి ఇది ఆశకు టైర్ 2 హీరోస్ లో ఒక సెన్సేషనల్ ఓపెనింగ్ అది కూడా భారీ మార్జిన్ తో కాగా నాని మాత్రం తన కెరీర్ లో నెవర్ బిఫోర్ ఓపెనింగ్ ని అయితే సొంతం చేసుకున్నాడని చెప్పాలి. ఇక వీకెండ్ నాటికి ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :