వరల్డ్ వైడ్ “జవాన్” లేటెస్ట్ వసూళ్లు.!

Published on Sep 22, 2023 4:00 pm IST


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార మరియు దీపికా పదుకోన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన మాసివ్ హిట్ చిత్రం “జవాన్” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం బాలీవుడ్ నాట రికార్డు ఓపెనింగ్స్ అందుకొని అదే రీతిలో వరల్డ్ వైడ్ గా బాలీవుడ్ అన్ని చిత్రాల్లో అయితే ఈ చిత్రం సరికొత్త రికార్డులు అయితే సెట్ చేస్తుంది. ఇక ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అందుకున్న వసూళ్ళని మేకర్స్ అనౌన్స్ చేసారు.

ఇప్పటి వరకు అయితే ఈ చిత్రం 937.61 కోట్ల గ్రాస్ ని అందుకొని 950 ఆ తర్వాత 1000 కోట్ల క్లబ్ లో చేరే దిశగా సాగుతుంది. దీనితో జవాన్ సెన్సేషన్ మాత్రం మరో వారం వరకు నాన్ స్టాప్ గా ఉంటుంది అని చెప్పాలి. మరి ఈ లోపలే 1000 కోట్ల మార్క్ ని కూడా ఇది కొట్టేస్తుందేమో అనేది కూడా ఆసక్తిగా మారింది. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ రోల్ లో నటించాడు.

https://x.com/RedChilliesEnt/status/1705153980408418587?s=20

సంబంధిత సమాచారం :