వరల్డ్ వైడ్ “విక్రమ్” లేటెస్ట్ కలెక్షన్ డీటెయిల్స్..!

Published on Jun 21, 2022 9:05 am IST


లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లు కీలక పాత్రల్లో అలాగే సూర్య సాలిడ్ క్యామియోలో నటించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ డ్రామా “విక్రమ్”. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం కమల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అండ్ సాలిడ్ కం బ్యాక్ గా నిలవగా తమిళ నాట భారీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీనితో ఈ సినిమాకి మూడు వారాలు వచ్చినా కూడా స్ట్రాంగ్ వసూళ్లు నమోదు అవుతున్నాయి.

మరి లేటెస్ట్ గా అయితే వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు 17 రోజుల్లో 370 కోట్ల గ్రాస్ ని అందుకుందట. దీనితో కోలీవుడ్ లో అయితే ఇదే 2.0 తర్వాత అత్యధికం అని తెలుస్తుంది. అలాగే ఎలాంటి హిందీ మార్కెట్ లో భారీ వసూళ్లు లేకుండా ఈ మార్క్ అందుకోవడం సెన్సేషన్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :