“గుర్తుందా శీతాకాలం” లో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు – డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్

“గుర్తుందా శీతాకాలం” లో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు – డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్

Published on Dec 4, 2022 9:36 PM IST


మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేము. అటువంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ ఎంటర్టైనర్ గుర్తుందా శీతాకాలం. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్లపై యంగ్ అండ్ టాలెంటెడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని నటిస్తున్నారు. కన్నడలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ ఈ సినిమా కి సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 9న గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు వస్తున్న సందర్బంగా డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

11 ఏళ్ల క్రితం అలా మొదలైంది సినిమా చేశాను. ఆ తర్వాత చందమామ కథలు వంటి లవ్ స్టోరీ రాశాను. తరువాత ఫ్యామిలీ, విలేజ్, గోదావరి స్లాంగ్ వంటి సినిమాలు, పొలిటికల్ ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్ కథలతో చాలా సినిమాలకు రాశాను. అయితే నా కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు వ్రాసిన జోనర్ మళ్ళీ రాయలేదు.

నేను ఏ సినిమాకైనా కథ రాయాలి అంటే ఆ కథ నాకు ఇన్స్పిరేషన్ కలిగించాలి, అలాగే ఆ కథలోని కంటెంట్ స్ట్రాంగ్ ఉండాలి. లవ్ స్టోరీ గాని పొలిటికల్ గాని, ఫ్యామిలీ డ్రామా గాని, యాక్షన్ గాని, ఏదైనా గాని చూసే ఆడియన్స్ కు ఎమోషన్ గా కనెక్ట్ అయినపుడే మనము సక్సెస్ అయినట్టు.

ఈ సినిమా గీతాంజలి జోనర్ ను టచ్ చేసినా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తోపాటు ఎమోషన్ కలిగించే ఫీల్ గుడ్ మూవీగా ఉంటుంది. ఈ సినిమా చూసే ప్రేక్షకులకు వారి మనసుల లోతుల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కథ ఉంటుంది.

ఈ సినిమాలో మూడు వేరేషన్స్ ఉంటాయి చాలా నేచుర‌ల్ త్రీ ఏజ్ గ్రూప్స్ క‌లిపిన ఒక మంచి ల‌వ్ స్టోరినే గుర్తుందా శీతాకాలం. గతంలో మనం చూసిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, ప్రేమమ్ వంటి సినిమాలు 10 సంవత్సరాల కోసారి కూడా రావు. ఇలాంటి సినిమాలకు కరెక్ట్ గా పోర్ట్రైట్ చేసే ఆర్టిస్టులు దొరకాలి. ఈ సినిమాలో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. సత్యదేవ్ నాకు తన చిన్నప్పటి నుంచి తెలుసు. తను మా ఇంట్లో మనిషిలా ఉంటాడు. తనకు 90 ఇయర్స్ క్యారెక్టర్ ఇచ్చినా, 19 ఇయర్స్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చాలా చక్కగా చేయగలడు.

ఈ మధ్య ప్రేక్షకులు రీమేక్ సినిమాలే ఎక్కువ చూస్తారు. ఆర్థిస్టులు కూడా రీమేక్ సినిమా లను ఛాలెంజ్ గా తీసుకొని పోటీపడి నటిస్తారు. ఎందుకంటే రీమేక్ లో ఆర్థిస్టులు నటించిన దానికంటే ఇంకా బెటర్ గా చెయ్యాలని ట్రై చేస్తారు. అప్పుడు సినిమా బాగా వస్తుంది. అలా చేసిన ఈ సినిమా కూడా 90% ఒరిజినల్ ఉండేలా సినిమాను రెడీ చేసాము. ఈ సినిమాను చాలా బ్యూటిఫుల్ లొకేషన్ లలో షూట్ చేశారు. ఈ సినిమాలో అందరూ చాలా చక్కగా నటించారు. మ్యూజిక్, కెమెరా పనితనం ఇలా ప్రతి ఒక్కటి ఈ సినిమాకు చక్కగా కుదిరాయి. సెన్సిబుల్ హార్ట్ ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ ఈ సినిమా కచ్చితంగా కనెక్ట్ అవుతుంది.

ఇప్పుడున్న ఆడియన్స్ కు నచ్చే విధమైన సినిమా తియ్యాలి అంటే స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి. అలాగే మనం చూపించే దాంట్లో ఎమోషన్ ఫేక్ ఉండకుండా హానెస్ట్ గా ఉంటే ఆడియన్స్ సినిమాను చూడగలుగుతారు, అప్పుడే మనం సక్సెస్ అయినట్టు.

నన్ను చాలామంది పెద్ద నిర్మాతలు నన్ను డైరెక్ట్ క్టర్ చేయమని అడిగారు కానీ నాకు డైరెక్షన్ చేయాలని థాట్ వచ్చినప్పుడే నేను చేస్తాను. ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలి.

చిరంజీవి లాంటి స్టార్ వ్యక్తికి డైలాగ్స్ రాస్తున్నప్పుడు నాకు ఎక్కువ ప్రెజర్ ఉండదు కానీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను రాసిన డైలాగులు చిరంజీవి గారి నోట్లోనుంచి వస్తే ఎలా ఉంటుందనే ఎగ్జైట్మెంట్ తో రాస్తాను.

ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది అంటారు. కానీ, నాకు జీవితంలో ఎటువంటి గోల్స్ లేవు. కానీ నాకు మంచి సినిమాలకు కథలు రాయాలి, నేను వెళ్లి పోయిన తర్వాత కూడా ఆ సినిమాలు ప్రేక్షకులకు గుర్తు ఉండాలని కోరుకుంటాను. అయితే నేను ఏ సినిమా చేసినా డెడికేటెడ్ గా 100% ఎఫెక్ట్ పెట్టి వర్క్ చేస్తాను అంతే తప్ప నాకు ఎటువంటి లక్ష్యాలంటూ ఏమి లేవు.

అందరూ ఈ టైటిల్ గురించి అడుగుతున్నారు. అయితే ఎండాకాలంలో ప్రేమికులకు లవ్ స్టోరీ బాగోదు, వానకాలం లవ్ అనేది పెళ్లైన వాళ్ళకు మాత్రమే బాగుంటుంది. శీతాకాలంలో లవ్ స్టోరీ మాత్రం ప్రేక్షకులకు పర్ఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టారు.

నెక్స్ట్ ప్రొడక్షన్ లో నేను,వేరే వాళ్ళు కలిసి మరీచిక సినిమా చేస్తున్నాను.ఆ సినిమా షూటింగ్ అయిపోయింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇందులో అనుపమ, రెజీనా, విరాజ్ అశ్విన్ ఇలా ఇందులో ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. వైజయంతి వారి బ్యానర్ లో అన్నీ మంచి శకునములే సినిమాకు చేస్తున్నాను.అలాగే నందిని రెడ్డి చేసే ప్రతి సినిమాకు కూడా రాస్తున్నాను అని ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు