‘రైటర్ పద్మభూషణ్’ మూడు రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్

Published on Feb 7, 2023 1:30 am IST

యువ నటుడు సుహాస్ హీరోగా టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా రోహిణి, ఆశిష్ విద్యార్థి, గోపరాజు రమణ వంటివి వారు కీలక పాత్రల్లో తెరకెక్కిన తాజా సినిమా రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ సంస్థలపై ఎంతో గ్రాండ్ గా రూపొందిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి తొలి రోజు తొలి ఆట నుండి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఆకట్టుకునే కథ, కథనాలతో హృద్యమైన ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ విడుదలైన అన్ని ప్రాంతాల ఆడియన్స్ ని అలరిస్తూ ప్రస్తుతం మంచి కలెక్షన్ తో దూసుకెళుతోంది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ గడచిన మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 5.2 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టినట్లు యూనిట్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. ఇక తమ సినిమాని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులకి రైటర్ పద్మభూషణ్ యూనిట్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తోంది.

సంబంధిత సమాచారం :