యూఎస్ లో డీసెంట్ హోల్డ్ తో “రైటర్ పద్మభూషణ్”.!

Published on Feb 8, 2023 9:00 am IST

లేటెస్ట్ గా టాలీవుడ్ దగ్గర వచ్చి మంచి హిట్ గా నిలిచిన చిత్రం “రైటర్ పద్మభూషణ్”. యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ నటించిన ఈ చిత్రంలో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా నటించింది. మరి దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ మహారాజా రవితేజ సహా ఎందరో స్టార్స్ ని సైతం మెప్పించింది. మరి ఈ చిత్రం వసూళ్ల పరంగా కూడా మేకర్స్ ఆనందకర రిజల్ట్ ని అయితే అందించింది అని చెప్పాలి.

ఈ సినిమా యూఎస్ వసూళ్లే అందుకు నిదర్శనం అని చెప్పాలి. రీసెంట్ గానే 2 లక్షల డాలర్స్ మార్క్ ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డీసెంట్ హోల్డ్ తో 2 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ కి అయితే చేరుకుంది. దీనితో సుహాస్ కెరీర్ లోనే కాకుండా ఈ సినిమా యూనిట్ అందరికీ ఈ చిత్రం ఓ గొప్ప విజయంలా నిలిచింది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో రోహిణి, ఆశిష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రల్లో నటించగా ఛాయ్ బిస్కెట్ మరియు లహరి ఫిల్మ్స్ వారు ఈ సినిమాని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :