లేటెస్ట్ : ‘రైటర్ పద్మభూషణ్’ రెండు రోజుల కలెక్షన్ వివరాలు

Published on Feb 5, 2023 4:14 pm IST


యువ నటుడు సుహాస్ హీరోగా టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ కమ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రైటర్ పద్మభూషణ్. యువ నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహర్ కలిసి చాయ్ బిస్కెట్ సినిమాస్, లహరి ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకి వచ్చి తొలి ఆట నుండే మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ఈ మూవీని తెరకెక్కించిన తీరుకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సైతం మంచి కలెక్షన్ ని రాబడుతోంది. కాగా రైటర్ పద్మభూషణ్ మూవీ మొత్తంగా గడచిన రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 3.6 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఆశిష్ విద్యార్థి, రోహిణి, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం :