“రైటర్ పద్మభూషణ్” కి యూఎస్ లో మంచి వసూళ్లు!

“రైటర్ పద్మభూషణ్” కి యూఎస్ లో మంచి వసూళ్లు!

Published on Feb 5, 2023 7:01 AM IST

యంగ్ నటుడు సుహస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 3 న థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. తొలి ప్రీమియర్ నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం యూ ఎస్ లో మంచి వసూళ్లను రాబడుతోంది.

రైటర్ పద్మభూషణ్ చిత్రం యూఎస్ లో 100 కే డాలర్ల కి పైగా వసూళ్లను రాబట్టింది. ఈరోజు అదే దూకుడు కొనసాగే అవకాశం ఉంది. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ లు నిర్మించిన ఈ చిత్రం లో టినా శిల్పారాజ్, రోహిణీ, ఆశిష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ లు ఈ సినిమా కి సంగీతం అందించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు