వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “రైటర్ పద్మభూషణ్”

Published on May 21, 2023 8:01 pm IST

టాలీవుడ్ నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ రైటర్ పద్మభూషణ్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఈ చిత్రం వచ్చే ఆదివారం, మే 28, 2023 న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు లో ప్రసారం కానుంది. టీనా శిల్పరాజ్, రోహిణి, ఆశిష్ విద్యార్థి లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్, శేఖర్ చంద్ర లు సంగీతం అందించారు. ఛాయ్ బిస్కెట్స్ ఫిల్మ్స్, మరియు లహరి ఫిల్మ్స్ లపై నిర్మించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :