హీరోయిన్ కి షాక్ ఇచ్చిన హ్యాకర్లు !

Published on Apr 4, 2022 7:33 pm IST

బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్‌ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అయితే, ఆమెకు తాజాగా హ్యాకర్లు షాక్ ఇచ్చారు. యామీ గౌతమ్‌ తన ఇన్‌ స్టాగ్రామ్ హ్యాండిల్‌ ని యాక్సెస్ చేయలేకపోపోతున్నాను అంటూ ట్వీట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని తన ఫాలోవర్స్ కు తెలియజేస్తూ.. తన ఇన్‌ స్టాగ్రామ్ ఖాతా బహుశా హ్యాక్ అయ్యి ఉండొచ్చు అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే.. తన ఇన్‌ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఏమైనా, ఎవరి గురించి అయినా ఇబ్బందికరమైన పోస్టులు వస్తే.. దయచేసి వాటిని నమ్మొద్దు అని.. అవి తాను పెట్టినట్లు భావించవద్దని యామీ గౌతమ్‌ తన ఫ్యాన్స్ కు అలాగే సినీ ప్రముఖులకు విన్నవించింది. ప్రస్తుతం యామీ గౌతమ్‌ బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అన్నట్టు ఆమె గత ఏడాది పెళ్లి కూడా చేసుకుంది.

సంబంధిత సమాచారం :