కన్నడ స్టార్ హీరో యశ్ పై కంగనా రనౌత్ ప్రశంసలు..!

Published on Apr 19, 2022 1:32 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “కేజీఎఫ్ చాప్టర్-1” సంచలనాలు సృస్టించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా ఏప్రిల్ 14న విడుదలైన “కేజీఎఫ్ చాప్టర్-2” కూడా రెట్టింపు అంచనాలతో దూసుకెళ్తుంది.

ఇదిలా ఉంటే యశ్ పై తాజాగా బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. కొన్ని దశాబ్దాలుగా భారత్ మిస్ అయిన యాంగ్రీ యంగ్ మేన్ యశ్ అని కితాబునిచ్చింది. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ మిగిల్చిన ఆ శూన్యతను యశ్ భర్తీ చేశాడని తెలిపింది. కంగన వ్యాఖ్యల పట్ల యశ్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :