వెకేషన్‌లో భార్యతో సరదాగా గడుపుతున్న యశ్.. పిక్స్ వైరల్..!

Published on Apr 27, 2022 12:02 am IST


కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “కేజీఎఫ్ కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2”. ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే షూటింగ్ కారణంగా మొన్నటి వరకు బిజీ బిజీగా గడిపిన కేజీఎఫ్ 2 చిత్ర బృందం ఇప్పుడు కాస్త సమయం దొరకడంతో వెకేషన్‌కి వెళ్లింది.

ప్రశాంత్ నీల్ తన భార్య లిఖితతో కలిసి, హీరో యష్ తన భార్య రాధిక పండిట్‌తో, భువన్ గౌడ, విజయ్ కిర్గందూర్ తదితరులు వెకేషన్‌కి వెళ్లారు. అయితే ఈ వెకేషన్ స్పాట్‌లో హీరో యష్ తన భార్య రాధిక పండిట్‌ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ, బుగ్గపై ముద్దు పెట్టుకున్న పిక్స్‌ను తాజాగా రాధిక తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్యూట్ కపుల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :